టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట్లో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈయన రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. 24 ఫ్రేమ్స్ లో డైరెక్టర్ విభాగంలో ఎన్నో మెళుకువలు నేర్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగి చివరికి కథను ఫైనల్ చేయించుకున్నాడు. అలా బద్రి సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూరీ జగన్నాథ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మహేష్ బాబు పోకిరితోపాటు మరి ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేశారు పూరీ జగన్నాథ్.


దాదాపు గత కొన్ని సంవత్సరాల క్రితం వరుస ఫ్లాప్ లు అవుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి దూరమైన పూరీ జగన్నాథ్ ఇటీవల భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమా లైగర్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  అయితే ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ అవ్వడంతో ఆయన డ్రీం ప్రాజెక్టు జనగణమన సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈడీ కేసులో ఇరుక్కున్న పూరీ జగన్నాథ్ తరచూ అలాంటి వివాదాలతోనే సతమతమవుతున్నాడు. ఇదిలా ఉండగా పూరీ జగన్నాథ్ డ్రీం ప్రాజెక్టు జనగణమన సినిమా ఇప్పుడే స్టార్ట్ అవ్వదు కాబట్టి తన తదుపరిచిత్రం కోసం ఏ హీరోని సంప్రదించబోతున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.


ఈ క్రమంలోని ఆయన తన తదుపరిచిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ తో చేయవచ్చు అనే వార్తలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.  ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పూరీ జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రవితేజతో తెరకెక్కించవచ్చు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఇందులో పూర్తి నిజాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: