తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రష్మిక మందన నాగ శౌర్య హీరో గా వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత రష్మిక అనేక తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించింది.

రష్మిక ఇప్పటి వరకు తన కెరీర్ లో నటించిన ఎన్నో తెలుగు మూవీ లు బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలవడంతో ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ప్రస్తుతం రష్మిక మందన సూపర్ క్రేజ్ ఉన్న మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన పై కన్నడ సినీ ప్రేమికులు చాలా సీరియస్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే.  కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి రష్మిక మండను ను బ్యాన్ చేయాలి అని చాలా మంది సినీ ప్రేమికులు వరుసగా పోస్ట్ లు కూడా పెడుతున్నారు.

దీనితో ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఖజానా బ్రాండ్ రష్మిక మందన ను అంబాసిడర్ గా  తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రష్మిక మందన ను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తున్నట్లు , అలాగే త్రిష ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటున్నట్లు ఈ సంస్థ తాజాగా వెల్లడించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు , తమిళ , హిందీ సినీ పరిశ్రమలో వరస అవకాశాలను దక్కించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: