టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రానా ఇప్పటికే అనేక మూవీ లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. దగ్గుపాటి రానా శేఖర్ కమల దర్శకత్వం లో తేరకేక్కిన లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లోని రానా నటన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే రానా తెలుగు తో పాటు ఇతర భాషల మూవీ లలో కూడా నటించి మంచి గుర్తింపు ను దేశ వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. దగ్గుబాటి రానా ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. సాగర కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హీరో గా నటించాడు.

మూవీ ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ ల చేరి పోయింది. ఈ మూవీ ద్వారా దగ్గుబాటి రానా కు మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా రానా ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది తీరుపై చాలా అసహనం వ్యక్తం చేశాడు. తన లగేజ్ మిస్ అయ్యింది అని ,  ఇండిగో స్టాప్ దాన్ని వెతికి పట్టుకోలేక పోయారు అని దగ్గుపాటి రానా తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడు కూడా ఎదురవలేదు అని , ఇది ఒక వరస్ట్ ఎయిర్లైన్స్ అంటూ రానా తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా రానా తాజాగా ఇండిగో విమానయాన సంస్థ పై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: