సినిమా అనే రంగుల ప్రపంచంలో ఇక నటీనటులు అందరూ కూడా ఎంతో అందంగా ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసి వారికి ఎలాంటి బాధలు లేవేమో అని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. ఇక లైఫ్ అంటే సినిమా వాళ్ళదే అని భావిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ పైకి నవ్వుతూ కనిపించే సినిమా వాళ్ళను కాస్త కదిలిస్తే కన్నీరు పెట్టించే ఎన్నో చేదు అనుభవాలు ఉంటాయన్నది మాత్రం ఇప్పటివరకు కొంతమంది జీవితాల గురించి తెలుసుకుంటే అర్థమైంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎన్నో వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఎల్బీ శ్రీరామ్ జీవితంలో కూడా ఇలాంటి  అనుభవాలు ఉన్నాయట.


 ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఎల్బీ శ్రీరామ్. ఇక తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉండడంతో స్టార్ కమెడియన్ గా ఎదిగారు అని చెప్పాలి. కేవలం కామెడీతో మాత్రమే కాదు తన నటనతో ఎన్నోసార్లు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఎల్బీ శ్రీరామ్. తనకు తరచూ ఒక కల వస్తూ ఉండేది.. నేను చనిపోతే నా స్నేహితులు నా పాడే మూయడమే ఆ కల.. నెలకి ఒకసారైనా ఆ కల రావడం జరుగుతూ ఉంటుంది.


 ఆ కల నాకు ఎందుకు వస్తూ ఉంటుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఆ కల ఎప్పుడు వచ్చినా కూడా భయంతో నా ప్రాణాలు పోయినట్లు అనిపించేది అంటూ ఎల్వి శ్రీరాం చెప్పుకొచ్చాడు. నేను చనిపోయిన తర్వాత మా స్నేహితులు మా అమ్మ దగ్గరకు పాడే మోసుకుని రావడం చూసి.. మా అమ్మ అప్పుడే వెళ్లడమేంటి నాలుగు రోజులు ఉండొచ్చు కదా అనడం.. అక్కడ నా పాడే మోసే వాళ్ళు తొందర పడుతున్నారమ్మ అంటూ నేను వెళ్లి పాడే పై పడుకోవాలి అని చెప్పగానే మేలుకోవ వస్తుంది. చుట్టూ చూస్తే ఎవరూ ఉండరు అంటూ తన కల గురించి చెప్పుకొచ్చాడు. తన కెరియర్ మొదట్లో వేషాల కోసం ఎన్నో బాధలు అనుభవించానని.. కానీ ఇక వచ్చిన అవకాశాలను నన్ను నేను నిరూపించుకొని మరిన్ని అవకాశాలను దక్కించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: