1000 సంవత్సరాల క్రితం జీవించిన రామానుజాచార్య విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి భోదించి చరిత్రలో నిలిచిపోయారు. ఆ మహోన్నత వ్యక్తి జీవితంలో ఎన్నో గొప్ప సంఘటనలు ఉన్నాయి. అలాంటి గొప్పవ్యక్తి జీవితం పై ఒక బయోపిక్ తీయాలని రాఘవేంద్రరావుకు వచ్చిన ఆలోచన శ్రీచిన్నజీయర్ స్వామీకి కూడ బాగా నచ్చడంతో ఇప్పుడు ఆమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ రచన ప్రారంభం అయినట్లు సంకేతాలు వస్తున్నాయి.
ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ బాగా నడుస్తూ ఉండటంతో ఈనాటి తరం వారికి రామానుజుడి చరిత్ర సరిగ్గా తీయగలిగితే గ్యారెంటీ హిట్ అన్న భావన రాఘవేంద్రరావుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈమూవీ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి నిర్మాత సి. కళ్యాణ్ ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో రామానుజుడుగా నటించడానికి బాలకృష్ణ ప్రాధమీకంగా తన అంగీకారాన్ని తెలియచేసినట్లు తెలుస్తోంది. సి. కళ్యాణ్ బాలకృష్ణల కాంబినేషన్ లో గతంలో ‘పరమవీర చక్ర’ ‘రూలర్’ ‘జయసింహ’ లాంటి సినిమాలు వచ్చాయి.
యోగుల పాత్రలు చేయడంలో నందమూరి తారక రామారావు ఎప్పుడు ముందు వరసలో ఉండేవారు. ఆయన కెరియర్ చివరిలో నటించిన ‘వీరబ్రహ్మం గారి చరిత్ర’ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలయ్య రామానుజుడు గా నటించి మెప్పించగలిగితే బాలకృష్ణ కెరియర్ లో గుర్తుండి పోయే విధంగా మారే ఆస్కారం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి