టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన రవితేజ ప్రస్తుతం మాస్ మహా రవితేజ గా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా మాస్ మహారాజా రవితేజ చాలా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఇక ఇందులో భాగంగానే తాజాగా రవితేజ ఆయన కొడుకు సినిమా ఎంట్రీ మరియు చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పాత్రకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పకచ్చాడు. 

అయితే ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఒక ప్రశ్నని అడిగాడు అదేంటంటే వాల్తేరు వీర సినిమా లోని మీ పాత్ర గురించి చెప్పండి అంటూ అడగగా రవితేజ స్పందిస్తూ... ఈ సినిమాలో నేను చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్న పాత్రను చేస్తున్నానని అది పవర్ఫుల్ పాత్ర... లేక ఇంకేమైనా నా అనేది మీరు సినిమా విడుదలైన తర్వాత చూసి చెప్పండి అంటూ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టమని అన్నయ్యతో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ సినిమా కథ మరియు క్యారెక్టర్ చాలా బాగా వచ్చాయని రవితేజ చెప్పుకొచ్చాడు.

ఇక దాంతోపాటు రవితేజ కొడుకు ఎంట్రీ పై స్పందిస్తూ నా కొడుకు సినీ ఎంట్రీ కి ఇంకా చాలా టైం ఉంది ఇప్పటికైతే అలాంటి ఆలోచనలు అయితే లేవు వాడు ఇంకా చదువుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ సినిమాలను మొదలుపెట్టింది చిరు అన్నయ్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ధమాకా సినిమా రౌడీ అల్లుడు స్టైల్ లో మీరు చూడొచ్చు... ఈ సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నిండిపోయి ఉంటుంది అంటూ చెప్పుకోవచ్చు రవితేజ. దీంతో రవితేజ చేసిన ఈ కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: