పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించారు. డిసెంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పుడు భారీ విజయంతో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమా లో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటించడం రవితేజకు అదృష్టం అని చెప్పవచ్చు. అలాగే ఈ ఏడాది చివరికి మరో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టిన ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ హిట్ తో దూసుకెళ్తోంది. అక్కడైతే ఏకంగా 2 లక్షల 50వేల డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసి మరింత స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది.
అంతేకాదు యూఎస్ లో డిమాండ్ మేరకు అక్కడ మరిన్ని థియేటర్స్ యాడ్ చేస్తున్నారట. ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు పక్క మాస్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు నిర్వాహకులు. ఈరోజు సాయంత్రం హైదరాబాదులో ధమాకా సినిమా మాస్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ
సినిమా రవితేజకు భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా గెస్ట్ గా నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.A