టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది శ్రీ లీల. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ట్రెండింగ్ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా అందరూ చెప్పే పేరు శ్రీ లీల. ఈమెకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఈమె ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు .అయితే దీనంతటికీ కారణం తన అందం, డాన్స్. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లు ఎవ్వరు కూడా ఈమెలాగా డాన్స్ చేయలేరు అని ఈమె అభిమానులు అంటున్నారు.

 ఇటీవల మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించింది ఈమె.  అయితే ఈ సినిమాలో శ్రీ లీలా డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈమె హీరోయిన్గా నటించిన ధమాకా సినిమా తాజాగా 100 కోట్ల క్లబ్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. అయితే ఈ స్టార్ హీరోయిన్ కూడా తొలిసారి 100 కోట్ల క్లబ్లో అడుగు పెట్టినందుకు చాలా సంతోషిస్తుంది.అయితే తాజాగా ధమాకా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఒక సక్సెస్ మీట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది...అయితే నిజానికి బయట చాలా నిదానసురాలుగా శ్రీ లీల కనిపిస్తుంది.

కానీ కోపం వస్తే మాత్రం ఇంట్లో రచ్చ రచ్చ చేస్తుంది .ఇక ఆమె చేసే రచ్చని ఎవ్వరూ తట్టుకోలేరు అని అంటుంది. అయితే తన కోపం వస్తే తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటుందట.. ఆ సమయంలో తన అమ్మని కూడా అలాగే అంటుందట.. ఆ ప్లేస్లో తన అమ్మ ఉన్న ఇంకెవరున్నా కూడా అలాగే అరుస్తుందట.. కోపం చల్లారాక ఎవరిని ఎందుకు తిట్టాను అని ఏడుస్తూ ఉంటుందట ఈమె ..అయితే అమ్మ కాబట్టి నాకు కోపాన్ని భరిస్తుంది.. కానీ వేరే వాళ్లయితే నా కోపాన్ని భరించలేరు.. అక్కడి నుండి కచ్చితంగా పారిపోతారు. అంటూ తన బిహేవియర్ గురించి ఆసక్తికర కామెంట్ చేసింది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి: