టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా చాలా కాలం కొనసాగిన  సునీల్ అందాల రాముడు మూవీతో హీరోగా మారిఅందరిని అలరించిన విషయం తెల్సిందే.అతనికి మంచి హీరోగా గుర్తింపుగా రాజమౌళి సినిమా మర్యాద రామన్న తో సునీల్ కి హీరో గా మంచి గుర్తింపు లభించింది.

దాని తర్వాత కొంత కాలం పాటు సునీల్ వరుసగా హీరోగా చేస్తూ కొన్ని మూవీస్ చేసాడు.అదే పందలో పోతున్న సునీల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ మిగులుస్తున్నాయి. అపుడే వెంటనే మళ్ళా కామెడీ ట్రాక్ పట్టడు సునీల్.అపుడు జనాలు మళ్ళా సునీల్ కామెడీ పరంగా మళ్ళా తన స్థానాన్ని అచీవ్ చేస్తార్ని భావించారు కానీ కమెడియన్ గా కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా,విలన్ గా సునీల్ ఎక్కువగా అలరిస్తున్నాడు.ఐతే ఒక కమెడియన్ సీరియస్ విలన్ గా చేయడం అనేది మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం.పుష్ప సినిమా లో మంగళం శ్రీను క్యారెక్టర్ లో సునీల్ ని చూసి అంతా షాక్ కి గురి అయ్యారు.అందుకే అనుకుంట ఆయనకు ఇప్పుడు వరుసగా విలన్ పాత్రలు వస్తున్నాయి.

దాంట్లో భాగంగానే తమిళం లో సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.అలాగే
 విశాల్ హీరోగా చేస్తున్న మార్క్ ఆంటోనీ మూవీ లో ఒక కీలక పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు.ఇంకా మూడు నాలుగు తమిళ మూవీస్ ల్లో కూడా సునీల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి తెలుగు లో కంటే ఆయన  తమిళనాట సునీల్ చాలా బిజీగా కనబడుతున్నారు.

అలాగే పరితోషకం విషయంలో ను కూడా ఆయన మన తెలుగు లో కంటే తమిళ్ లో ఎక్కువ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.ఏదేమైనా ఆయన తెలుగు లో తానేంటో నిరూపించుకొని పోయి  ఇప్పుడు తమిళం లో నిరూపించుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: