వ్యక్తిగతంగా రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ మధ్య బాబాయ్ అబ్బాయి రిలేషన్ కాకుండా స్నేహం అనే రిలేషన్ బాగా ఉంది అని.. ఇప్పటికే పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు వీరిద్దరి అభిమానుల మధ్య గొడవలు జరగడం పలు ఆశ్చర్యానికి దారితీస్తోంది. ఈ ఇద్దరు మెగా కుటుంబానికి చెందిన హీరోలు అయినప్పటికీ కూడా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే బిరుదు ఎవరికి దక్కాలి అనే విషయంపై అటు రాంచరణ్ అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోతూ కామెంట్లు చేస్తూ ఒకరకంగా వీరిద్దరి హీరోలను కూడా మానసికంగా ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే.


దే కాల్ హిం ఓజీ అనే సినిమా చేస్తున్నాడు అంటే వాళ్లు ఆయనను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని పిలుస్తారు అంటూ అది సినిమా పేరు అని ఎప్పుడైతే సుజీత్ సినిమా పేరును రివిల్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడో అప్పుడు రామ్ చరణ్ అభిమానులు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ రామ్ చరణ్ రియల్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టేశారు. అలా చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు వెనక్కి తగ్గుతారనుకున్నారో ఏమో వారు మరింతగా రంగంలోకి దిగి రచ్చ చేయడం మొదలుపెట్టారు.

ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే ఒకరి కుటుంబాల గురించి.. భార్యల గురించి.. వ్యక్తిత్వాల గురించి చర్చించుకునే వరకు వెళ్ళింది. నిజానికి ఇద్దరి హీరోల అభిమానులు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉంది ఎందుకంటే ఒకరు మెగాస్టార్ చిరంజీవి సోదరుడైతే.. మరొకరు చిరంజీవి తనయుడు.. వారికోసం అభిమానులు కొట్టుకోవడం రెండు వర్గాలుగా విడిపోవడం అనేది పద్ధతిగా లేదు.. మొత్తానికైతే మెగా కుటుంబానికి ఇబ్బంది కలుగుతోందని చెప్పవచ్చు.  ఇప్పటికైనా వారు తమ అభిప్రాయాలను వెనక్కు తీసుకోవాలని ఎవరు ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అయిన బాబాయ్ అబ్బాయిలు ఎవరో ఒకరు అవుతారు కదా అంటూ మిగతా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: