చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు పైకి హుందాగా కనిపించినా వాళ్ల రియల్ బిహేవియర్ వేరు అని చాలా మందికి తెలుసు.. అయితే కళ్యాణ్ రామ్ తో స్నేహం చేసిన వాళ్లు మాత్రం ఆయన ఎంతో మంచి వ్యక్తి అని ఎప్పుడూ చెబుతూ వుంటారు.

సోషల్ మీడియాకు కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నా కానీ తన ఫ్యామిలీకి అలాగే అభిమానులకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ కళ్యాణ్ రామ్ తట్టుకోలేరని చిత్ర పరిశ్రమలో అందరికి తెలుసు.. కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది.

అమిగోస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ఆహా ఓటీటీ నుంచి అన్ స్టాపబుల్ షోకు పిలుపు రాలేదని ఆ రీజన్ వల్లే నేను ఆ షోలో కనిపించలేదని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.. అయితే అన్ స్టాపబుల్ సీజన్3 లో మాత్రం కళ్యాణ్ రామ్ కచ్చితంగా కనిపించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అమిగోస్ కు కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

అయితే కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి కాగా కళ్యాణ్ రామ్ చేతిపై కూడా స్వాతి పేరు ఉంటుంది. ఆ పచ్చగొట్టు గురించి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ భార్యపై ఉన్న ప్రేమతో ఆ పచ్చబొట్టు వేయించుకున్నట్టు కూడా తెలిపారు. చాలా సంవత్సరాల క్రితం తనకు ఒక ఆరోగ్య సమస్య వచ్చిందని ఆ సమయంలో స్వాతి నాకు తల్లిలా సేవలు చేసి కోలుకోవడానికి కారణమయ్యారని కూడా కళ్యాణ్ రామ్ అన్నారు. 

నాకు సూది అంటే ఎంతో భయమని టాటూ వేయించుకోవడం వల్ల నాకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నా కూడా తనపై ఇష్టం వల్ల వేయించుకున్నానని రిస్క్ అయినా కూడా చేశానని కళ్యాణ్ రామ్ తెలిపారు. అందరికీ భార్యలు సేవలు చేస్తారని అయితే స్వాతి ఎంతగానో కేర్ తీసుకుందని ఆయన కామెంట్లు కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: