యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30 అనే పేరుతో విడుదల చేస్తూ వస్తుంది. 

మూవీ లో జాహ్నవి కపూర్ ... ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతుంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో జాహ్నవి కపూర్ అదిరిపోయే లుక్ లో ఉంది. దానితో ఇప్పటికే ఈ మూవీ ద్వారా జాహ్నవి కాపూర్ తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ కి అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క ముహూర్తమును ఈ నెల 23 వ తేదీన ఖరారు చేసినట్లు ఈ మూవీ యూనిటీ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: