మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ యువ నటుడు ఆఖరుగా అశ్వత్ మరిమత్తు దర్శకత్వంలో రూపొందిన ఓరి దేవుడా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఇలా ఓరి దేవుడా మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మంచి జోష్ లో ఉన్న విశ్వక్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ నివేత పేతురాజ్ ... విశ్వక్ కు జోడిగా నటించింది. ఈ మూవీ ని మార్చ్ 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న విశ్వక్ ... అర్జున్ తో వివాదం గురించి స్పందించాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విశ్వక్ మాట్లాడుతూ ... అర్జున్ తో జరిగిన వివాదం గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు అని స్పష్టం చేశాడు. తాజా ఇంటర్వ్యూలలో భాగంగా ఒక విలేఖరి ... అర్జున్ తో కాంట్రవర్సీ తర్వాత మీరు ఆయనకు చాలా పెద్ద మొత్తం లో డబ్బులు ఇచ్చారంట ఇది ఎంత వరకు నిజం అని ప్రశ్నించింది. దీనికి ఆయన బదులు ఇచ్చేందుకు నిరాకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: