టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఐనా భీమ్లానాయక్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఇక్కడ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ఇటీవలే సార్ చిత్రంతో అదిరిపోయే విజయాన్ని కూడా అందుకుంది.

సినిమా తమిళం, తెలుగులో రెండింట్లోనూ సక్సెస్ అయింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష అనే మూవీలో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భోగవల్లి బాపినీడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా యూనిట్‌పై సంయుక్త మండిపడింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది.

ఉగాది రోజున విరూపాక్షలో తన పోస్టర్ విడుదల చేస్తామని చెప్పి.. చేయనందుకు డైరెక్టుగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటే సినీ చిత్ర బ్యానర్‌కు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టింది. "ముందు నా బాధను వ్యక్తం చేసేముందు విరూపాక్షలో నా ప్రయాణం అద్భుతంగా సాగిందని చెప్పాలనుకుంటున్నాను. అమెజింగ్ యాక్టర్స్, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో ఆశించా. కానీ మీరు ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు? ఉగాది సందర్భంగా నా పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తామని మీరు హామి ఇచ్చారు. ఎక్కడ రిలీజ్ చేశారు?" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది.

ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఉగాదికి తన విరూపాక్షలో తన పోస్టర్ విడుదల చేయకపోవడంపై సంయుక్త బాగా ఫీలైనట్లుంది. అందుకే ఈ విధంగా పోస్ట్చే సిందని నెటిజన్లను కామెంట్లు చేస్తున్నారు

అయితే సంయుక్త మీనన్ చేసిన ఈ పోస్టుకు సదరు చిత్రయూనిట్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఈ పోస్ట్ ఆమె సరదాగా పెట్టారా లేక కోపంగా పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే విరూపాక్ష చిత్రం నుంచి టీజర్ విడుదల కాగా.. దానికి మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తోంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్కీన్ ప్లే అందిస్తున్నారు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. వరల్డ్ వైడ్గా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: