టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం తాజాగా మీటర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ కి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ మూవీ.ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది.

 అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి రెండు పాటలను కూడా విడుదల చేసింది. ఆ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమాలో హీరో గా నటించిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు సంబంధించిన తన డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని కిరణ్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.

ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ యువ హీరో మీటర్ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి. ఇది ఇలా ఉంటే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందు బాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: