
ఇకపోతే ప్రస్తుతం నాని సరసన దసరా సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా మార్చి 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు సౌత్ లోనే కాదు అటు నార్త్ లో కూడా ప్రమోషన్స్ సులువు చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ముంబైలో కూడా చిత్ర బృందంతో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ కు అక్కడ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ప్రశ్నలు ఎదురవగా వెంటవెంటనే వాటికి సమాధానాలు ఇచ్చేసింది. మీకు బాలీవుడ్ లో నటించాలనే ఆసక్తి ఉందా అని అడగగానే..అవును అవకాశం వస్తే వదులుకుంటానా అంటూ రిప్లై ఇచ్చింది.
మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే..షారుక్ ఖాన్ అని.. ఆయనతో నటించే అవకాశం ఒక్కసారి వచ్చినా..అస్సలు వదులుకోను.. కనీసం జీవితంలో ఒక్కసారి అయినా షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అంటూ తన మనసులో మాట బయట పెట్టింది. షారుక్ ఖాన్ అంటే పడి చచ్చేంత ఇష్టం అని తన మనసులో మాటగా బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే దసరా సినిమాలో డి గ్లామరస్ పాత్ర పోషిస్తుంది కీర్తి సురేష్. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
.