
ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత నానితో కలిసి నిన్ను కోరి సినిమాలో కూడా నటించారు అని చెప్పాలి. ఇక ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేసి ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది అని చెప్పాలి. అయితే మలయాళం లో కూడా కొన్ని సినిమాలు చేస్తూ ఉంది. అయితే ఇక ఇప్పుడు నివేదా థామస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నివేదా ఒక హీరోని ప్రేమించి చివరికి అతని చేతిలో మోసపోయిందట.
అయితే గతంలో ఆ హీరోతో ప్రేమలో ఉన్నప్పుడు నివేదా పెళ్లి మరి కొన్ని రోజుల్లో జరగబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆ హీరో ఇంట్లో పెద్దలు కుదిరిచిన సంబంధాన్ని చేసుకున్నాడట. ఇలా నివేద థామస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడట. దీంతో నివేదా కొన్నాళ్లపాటు అటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. గతంలో చాలా సన్నగా ఉన్న నివేద థామస్ డిప్రెషన్ కారణంగానే బొద్దుగా తయారయ్యిందట. ఇక డిప్రెషన్ నుంచి కోల్కొని ఇప్పుడిప్పుడే మళ్ళీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ.