
అయితే ఇలాంటి సమయంలోనే ఐపిఎల్ కూడా ప్రారంభం కాబోతున్నది ఈ ఎఫెక్ట్ కచ్చితంగా సినిమా మీద పడుతుందని పలువురు సినీ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.ముఖ్యంగా ఇండియాలో ఐపీఎల్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా ఐపీఎల్ లవర్స్ ఈ సమయంలో ఎలాంటి సినిమాలు కూడా వెళ్లడానికి ఇష్టపడరు కేవలం ఐపిఎల్ చూడడానికి ఇష్టపడతారు. అందుకోసమే కచ్చితంగా నాని విడుదల చేస్తున్న దసరా సినిమా పైన ఈ ఎఫెక్ట్ చూపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విడుదలైన చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తమ ఫేవరెట్ ప్లేయర్స్ లో ఆటలు చూసేందుకు ప్రేక్షకులు సైతం ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు.
మరి ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల పైన ఐపిఎల్ ప్రభావం ఎంతగా ఉంటుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.. ఒకవేళ కచ్చితంగా ఐపీఎల్ ప్రభావం సినిమాల మీద పడిందంటే రాబోయే రోజుల్లో విడుదలయ్యే సినిమాలు పలు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.. ప్రస్తుతం ఈ విషయాన్ని కొంతమంది సినీ విశ్లేషకులు తెలియజేయడం జరిగింది. ఇక గతంలో కూడా ఎన్నో చిత్రాలు ఐపీఎల్ సమయంలో పెద్ద సినిమాలు ఏవి విడుదల కాలేదు.