రామ్ చరణ్ బర్తడే వేడుకలను అభిమానులు ఫుల్ ఖుషి అయ్యేలా చేసుకుంటున్నారు. తాజాగా RC -15 చిత్రానికి సంబంధించి టైటిల్ లోగోను ఈ రోజున విడుదల చేయడం జరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులను చిత్ర బృందం ఫుల్ ఖుషి అయ్యేలా చేసింది. RC -15 చిత్రానికి గేమ్ చేంజ్( GAME CHANGER)అనే ఒక పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో ద్వారా టైటిల్ ని రివిల్ చేయడం జరిగింది.


మొదట ఈ చిత్రానికి సీఈవో ,సర్కారోడు అనే పేర్లు ఎక్కువగా ప్రచారంలో వినిపించాయి.. కానీ వాటికి భిన్నంగా గేమ్ చేంజర్ అనే ఒక సరికొత్త టైటిల్ ని ఖరారు చేశారు చిత్ర బృందం. సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం రాజకీయ వ్యవస్థలోని అవినీతిపైన పోరాటం చేసే ఎలక్షన్ ఆఫీసర్గా చరణ్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ.. నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఇటీవల గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి షూటింగ్ హైదరాబాదులో 10 కోట్ల రూపాయలను ఖర్చుతో ఒక పాటను చిత్రీకరించడం జరిగింది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి టైటిల్ వీడియో కూడా వైరల్ గా మారుతోంది. మరి ఈసారి రామ్ చరణ్ ఏ విధంగా అభిమానులను అలరిస్తారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: