ఈమధ్య మన టాలీవుడ్ లో వచ్చే కమర్షియల్ మూవీస్ లో ఖచ్చితంగా ఓ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ ఐటమ్ సాంగ్ తోనే మూవీపై భారీ హైట్ ను క్రియేట్ చేస్తున్నారు. చాలావరకు ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ పెడుతున్నారు. గతంలో కన్నా ప్రస్తుతం ఐటెం సాంగ్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ తో ఐటెం సాంగ్స్ నీ ప్లాన్ చేస్తున్నారు. ఇక కొంతమంది అగ్ర హీరోయిన్లు అయితే ఒకపక్క నటిస్తూనే మరోపక్క ఐటమ్ సాంగ్స్ కి ఓకే చెప్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ ఏ సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినా భాషతో సంబంధం లేకుండా ఇట్టే ఓకే చేసేస్తున్నారు. 

అందులో ఇప్పుడు ముందు వరుసలో ఉంది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది. ఇటీవల బాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా మెప్పించిన ఊర్వశి కి ఇప్పుడు వరుస ఐటం సాంగ్స్ ఆఫర్ వస్తుండడంతో గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఐటెం సాంగ్స్ చేస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అనే సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి డాన్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సాంగ్ హిట్ అవ్వడం తో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

తాజాగా అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' సినిమాలో ఓ స్పెషల్ ఐటెం నెంబర్ ని ప్లాన్ చేయగా.. ఇందులో అఖిల్ తో కలిసి ఊర్వశి చిందేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయిందట. ఇక ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందని తెలుస్తోంది. బోయపాటి సినిమాలో ఐటెం సాంగ్ అంటే అది ఎంత మాస్ గా ఉంటుందో తెలిసిందే. అందులోనూ ఉస్తాద్ హీరో రామ్ తో ఊర్వశి ఈ మూవీలో మాస్ ఐటెం నెంబర్ తో అదరగొట్టబోతుందట. అలా మొత్తం గా ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఐటెం సాంగ్స్ తో దూసుకుపోతోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. మరి ముందు ముందు ఇంకెన్ని ఐటమ్ సాంగ్స్ లో తన డాన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: