కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సూర్య గురించి ప్రత్యేకం గా ఇండియన్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూర్య కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు . ఇది ఇలా ఉంటే గజినీ మూవీ తో టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయా న్ని అందుకొని మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత నుండి దాదాపు తాను నటించిన ప్రతి మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేస్తున్నాడు.
 

అందులో భాగంగా కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య తన కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతోంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజామూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

మూవీ ని పది భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ విడుదల తేదీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ను అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 16 వ తేదీన ఉదయం 9 గంటల 05 నిమిషాలకు ఈ మూవీ టైటిల్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: