
ఈ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని.. నటీనటులు సైతం ఒక రొమాంటిక్ డ్యాన్స్ ను రికార్డు చేసి విడుదల చేసినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఈ సినిమాలోని సాంగ్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు షారుక్ బ్లాక్ దుస్తులలో నయనతార ఎరుపు రంగు దుస్తులలో కలిగి ఉంది.సెట్ నుంచి అనేక చిత్రాలు వీడియోలు ఆన్లైన్లో లీక్ అవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. దీంతో చిత్ర బృందం ఇలాంటి లీకులను అరికట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నారు.. కానీ బాలీవుడ్లో వినిపిస్తున్న ప్రకారం జవాన్ టీం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఫోటోలను వీడియోలను లీక్ చేస్తోందని దీని ద్వారా ఈ సినిమాకి మంచి హైప్ వస్తుందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పాటల సన్నివేశాలతో పాటు ఇతర ఫోటోలు కూడా ఆన్లైన్లో లీక్ అవడం జరిగింది.. ఈ వీడియోలో షారుక్ నయనతార ఏదో బొట్ లో ప్రయాణిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులోనే ఈ పాటని చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. మరి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి నయనతారతో ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం ఇందులో షారుక్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రంలో నయనతార కూడా బికినీ ధరిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.