
తాజాగా ఈ నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యంగా పీపుల్ మీడియా అంటే ఒక బ్రాండ్ గా కాకుండా ఒక మంచి సినిమా తీయాలని ఆలోచనలతో ముందుకు వెళుతున్నాము రామబాణం మూవీ కూడా అలాగే తీసాము. డైరెక్టర్ శ్రీవాస్ ఈ కథ చెప్పినప్పుడు ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథల అనిపించింది అందుకే ఈ సినిమాను చేశామని తెలిపారు.
ఈ చిత్రం బ్రదర్స్ సెంటిమెంట్తో రన్ అవుతుందని తెలిపారు. గతంలో లక్ష్యం లౌక్యం సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుందని తెలిపారు. మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేయడమే ఒక ఫ్యాక్టరీ మోడల్ లో ప్రారంభించాము నిర్మాణ రంగంలో అడుగుపెట్టడానికి ముందే ఇండస్ట్రీ గురించి బాగా రీసర్చ్ చేశామంటూ తెలిపారు. మిగతా కొత్త నిర్మాతల ఒకటి రెండు సినిమాలు కాకుండా ఒకేసారి ఎక్కువ సినిమాలు తీస్తూ ఒకటి కాకపోతే మరొకటి విజయం సాధిస్తుందని నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రామబాణం అనే టైటిల్ బాలయ్య గారి సూచించారని తెలిపారు. వాస్తవానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రారంభంలోనే టీవీ రంగంలో అడుగుపెట్టాం ఈటీవీలో మూడు సంవత్సరాల పాటు పాడుతా తీయగానే కార్యక్రమాన్ని చేసాము ఆ తరువాత నుంచి సినిమాలలో మొదలుపెట్టి 100 సినిమాల పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం వీరి వద్ద 30 నుంచి 40 సినిమాలు వివిధ నిర్మాణ దశలో ఉన్నట్లు సమాచారం