తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో "అ" మరియు "జాంబిరెడ్డి" మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించాయి. కొంత కాలం క్రితం ఈ దర్శకుడు సీనియర్ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సస్పెన్స్ ... ద్రిల్లర్ మూవీ ని తెరకెక్కించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ దర్శకుడు తేజ హీరోగా హనుమాన్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా అది జనాల అంచనాలకు మించి ఉండడంతో ఈ మూవీ పై ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ దర్శకుడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా హనుమాన్ మూవీ గురించి కొన్ని అద్భుతమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా మాట్లాడుతూ ... హనుమాన్ మూవీ లో 1600 పైగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి. అవి అన్ని కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి.

విఎఫ్ఎక్స్ పనులకు సంబంధించిన వర్క్ మొత్తం జూన్ నెల చివరి వరకు పూర్తి కానుంది. దానితో ఈ మూవీ విడుదల తేదీని జులై నెలలో ప్రకటిస్తాం అని ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తేజ సజ్జ ... ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన జంబిరెడ్డి మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో పొందుతున్న హనుమాన్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రెంట్ సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: