ఈ మధ్య కాలంలో సినిమాల ప్రమోషన్ లలో భాగంగా మూవీ బృందాలు సినిమాల నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోలు అంటూ విడుదల చేస్తూ వస్తున్నారు. అలా విడుదల చేసిన వాటిలో కొన్నింటికి అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ వస్తున్నాయి. అలా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయినా ఫస్ట్ గ్లిమ్స్ వీడియోలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 గ్లిమ్స్ వీడియోలు ఏవో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పూజ హెగ్డే , శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ బృందం ఏ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు 24 గంటల సమయంలో 20.98 మిలియన్ వ్యూస్ లభించాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప 2 మూవీ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు 24 గంటల సమయంలో 20.45 మిలియన్ వ్యూస్ లభించాయి.

టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం లైగర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీమూవీ బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియోకు 24 గంటల సమయంలో 15.92 మిలియన్ వ్యూస్ లభించాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ నుండి ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితం ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు 24 గంటల సమయంలో 15.77 మిలియన్ వ్యూస్ లభించాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియోకు 24 గంటల సమయంలో 8.49 మిలియన్ వ్యూస్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: