టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. వరుసగా సూపర్ హిట్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే కేవలం సినిమాల విషయంలోనే కాదు మిగతా హీరోలతో పోల్చి చూస్తే అటు వాణిజ్య ప్రకటనలు చేయడం విషయంలో కూడా మహేష్ బాబు ముందు వరసలో ఉన్నాడు అని చెప్పాలి. తన కెరియర్ పుంజుకున్న నాటి నుంచే వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలుపెట్టాడు మహేష్ బాబు. అయితే ఇలా యాడ్స్ చేయడం ద్వారా గట్టిగానే సంపాదిస్తున్నాడు. అయితే ఇలా వాణిజ్య ప్రకటన ద్వారా వచ్చిన మనీతో పిల్లలకు ఉచిత వైద్యం చేయిస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నాడు. ఎంతోమంది హీరోలు కోట్ల రూపాయల ఆదాయం కోసం వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ఉంటే  మహేష్ బాబు మాత్రం ఇక ఖాళీ సమయంలో వాణిజ్య ప్రకటనలు చేస్తూ తద్వారా వచ్చిన డబ్బును పేదల కోసం ఉపయోగిస్తూ ఎంతోమందికి దేవుడిగా మారిపోయాడు అని చెప్పాలి. ఇక టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోలతో పోల్చి చూస్తే వాణిజ్య ప్రకటనలు చేయడంలో ఇక మహేష్ బాబు అందరికంటే టాప్ లో ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో బ్రాండ్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన మహేష్ బాబు ఇక ఇప్పుడు మరో కొత్త యాడ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఒక మొబైల్ ఫోన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు. ఇక అదే సమయంలో మొబైల్ ఫోన్ యాడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 10వ తేదీ లోగా ఇక ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందట. ఆలోపే మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మొబైల్ బ్రాండ్ ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. అయితే ప్రస్తుతం తండ్రి బాటలోనే కూతురు సితార కూడా నడుస్తుంది. తల్లి నమ్రతతో  కలిసి ఒక వాణిజ్య  ప్రకటనలో నటిస్తుందట సీతారా.

మరింత సమాచారం తెలుసుకోండి: