సాధారణంగా చిన్న హీరోల సినిమాల్లో అయితే హీరో హీరోయిన్లు ఎవరు ఉండాలి అనే విషయాన్ని దర్శక నిర్మాతలు నిర్ణయిస్తూ ఉంటారు. కానీ స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం అలా ఉండదు. హీరోలు ఎవరిని చెబితే వారిని హీరోయిన్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సాంప్రదాయం ఇప్పుడు నుండి కొనసాగుతూ వస్తుంది కాదు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి కూడా తమ సినిమాలో హీరోయిన్గా ఎవరు ఉండాలో ఇక వాళ్లే ఎంపిక చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా హీరోయిన్ల విషయంలో కొన్నిసార్లు హీరోల ఎంపిక సక్సెస్ అయితే మరికొన్నిసార్లు మాత్రం ఫ్లాప్ అవుతూ ఉంటుంది.


 అయితే ఇప్పుడు వరకు అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు మాత్రం అటు హీరోయిన్స్ విషయం లో వేసుకున్న లెక్కలు మాత్రం ఫ్లాప్ అవ్వలేదు అని చెప్పాలి. కథ పరంగా కంటెంట్ పరం గా ఇక హీరోయిన్ పాత్రకు ఎవరైతే సరిపోతుంది అన్న విషయం లో పక్కా క్లారిటీ తో ఉంటాడట మహేష్ బాబు. ఈ క్రమం లోనే తన సినిమా లో హీరోయిన్ ని ఒక క్వాలిటీ చూసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడట.


 తన సినిమా లో ఎవరైతే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలి అని మహేష్ బాబు అనుకుంటాడో ఇక ఆ హీరోయిన్ ని ముందు నుంచే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడట.. డాన్స్ ఎలా చేస్తుంది.. ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుంది.. నటన పరంగా పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుంది.. రొమాంటిక్ సీన్స్ దగ్గర నుంచి ఎమోషనల్ సీన్స్ వరకు కూడా ఎలా చేయగలుగుతుంది అనే విషయంపై ఇక ఒకటికి పది సార్లు పరిశీలిస్తూ ఉంటాడట మహేష్ బాబు. ఇక ఆ తర్వాతే సినిమాల్లోకి తీసుకుంటాడట. తన తండ్రి కృష్ణ నుంచి ఈ విషయాన్ని అలవాటును చేసుకున్నాడట మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: