రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ ఇండియా సినిమా జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన అన్ని ప్రాంతాల థియేటర్ హక్కులను అమ్మి వేసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 17.60 కోట్లు , యుఎ లో 14.50 కోట్లు , ఈస్ట్ లో 8.80 కోట్లు , వెస్ట్ లో 7.20 కోట్లు , గుంటూరు లో 8.60 కోట్లు , కృష్ణ లో 8.50 కోట్లు , నెల్లూరు లో 4.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మూవీ కి కర్ణాటక లో 16.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... తమిళ నాడు లో 5 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 కోట్లు , కేరళ లో 2 కోట్లు , ఓవర్ సీస్ లో 21.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా కనుక ప్రపంచ వ్యాప్తంగా 242 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: