రెబల్ స్టార్ ప్రభాస్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ రేంజ్ మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ మిర్చి సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగాడు. ఆ తర్వాత బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. దానితో ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమా లలో అంతకు మించిన భారీ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 16వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.84 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.04 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.07 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 64.95 కోట్ల షేర్ 103.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.

మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ మరో 55.05 కోట్ల షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: