సోమవారం అర్థరాత్రి 1 గంట 49 నిమిషాలకు చరణ్ ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించినట్టు ప్రకటించారు. "మనవరాలు పుట్టడం ఎంతో అపురూపం. ఎన్నో సంవత్సరాలుగా చరణ్ ఉపాసన తల్లిదండ్రులు అవ్వాలని, మా చేతిలో ఓ బిడ్డను పెట్టాలని కోరుకుంటున్నాం. ఇన్నేళ్లకు నా కోరిక తీరింది. అందుకే ఇది మాకు చాలా అపురూపం." అంటూ మెగా స్టార్ విపరీతమైన ఆనందానికి లోనయ్యాడు.
అంతేకాదు తన కోడలు ఉపాసన కోసం ది బెస్ట్ వైద్య బృందాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారని వచ్చిన వార్తలను చిరంజీవి ధృవీకరించారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని అన్ని రకాలుగా కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ది బెస్ట్ టీమ్ ను ఏర్పాటుచేశామని చిరంజీవి తెలియ చేశాడు. మంగళవారం ఆడ బిడ్డ పుట్టడంతో తమ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టిందని భావిస్తున్నాను అంటూ తమ కులదైవం ఆంజనేయస్వామి వరప్రసాదం తన మనవరాలు అంటూ చిరంజీవి విపరీతమైన తన ఆనందాన్ని తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ బెస్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ గా ఎందరి దృష్టినో ఆకర్షించిన ఈ జంట ఇప్పుడు తల్లి తండ్రులు అవ్వడంతో చిరంజీవి అభిమానులతో పాటు చరణ్ అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆనందానికి లోనై సంబరాలు చేసుకుంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి