మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు సాయి ధరంతేజ్ .తాజాగా విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే విరూపాక్ష బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పటివరకు తన తదుపరి సినిమాని ప్రకటించలేదు సాయి ధరంతేజ్. ఇక యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో వచ్చిన సాయి ధరంతేజ్ ఈ సినిమాతో ఊహించిన బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. 

కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి సంచలనాన్ని సృష్టించింది. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .అయితే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ సినిమా తర్వాత సినిమాను ఒక ప్లాప్ డైరెక్టర్ తో చేయబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ డైరెక్టర్ మరెవరో కాదు సంపత్ నంది. ఈ డైరెక్టర్ గత చిత్రం సిటీ మార్ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర యావరేజ్ గా నిలిచింది. 

దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడు సంపత్. తాజాగా సాయిధరమ్ తేజ్ కి ఒక కథను వినిపించాడట. ఈ దర్శకుడు కథలోని పాయింట్ నచ్చడంతో సాయిధరమ్ తేజ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారన్న సమాచారం సైతం వినపడుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? టెక్నీషియన్స్ కి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట మేకర్స్. దీంతో సాయి ధరం తేజ్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: