కొన్ని సందర్భాలలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు విడుదల అయిన సమయం లోనే ఇతర భాష సినిమాలు కూడా తెలుగు భాషలో విడుదల అయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు విడుదల అయిన సందర్భాలలో ఇతర భాష హీరోల సినిమాలు విడుదల అయినట్లు అయితే వాటికి ప్రేక్షకుల నుండి పెద్దగా గుర్తింపు లభించదు. అలాగే ఆ సినిమాలకు మంచి టాక్ వచ్చిన కూడా భారీ కలక్షన్ లు వచ్చే అవకాశాలు ఉండవు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అదే సమయంలో తమిళ స్టార్ హీరో సినిమా కూడా తెలుగు లో విడుదల కాబోతుంది. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంతు కేసరి సినిమా మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు అనే రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు మూవీ లపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ రెండు మూవీ ల కంటే ఒక రోజు ముందు తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో అయినటువంటి దళపతి విజయ్ హీరోగా రూపొందిన లియో సినిమా కూడా తెలుగు లో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ భగవత్ కేసరి ... టైగర్ నాగేశ్వరరావు సినిమాలపై ఇంతకు మించిన అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అలాగే ఈ రెండు మూవీ లు స్టేట్ మూవీ లు కావడం ఈ రెండు సినిమాలకు అదనంగా కలిసి వచ్చే అంశం. దీనితో లియో మూవీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: