టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తాజాగా "స్పై" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. గర్రి బి హెచ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ ... నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తాజాగా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకొని మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్ లను రాబట్టింది అనే విషయాలను తెలుసుకుందాం.

స్పై మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 1.72 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 56 లక్షలు ... యు ఏ ఏరియా లో 54 లక్షలు ... ఈస్ట్ లో 33 లక్షలు ... వెస్ట్ లో 22 లక్షలు ... గుంటూరు లో 48 లక్షలు ... కృష్ణ లో 25 లక్షలు ... నెల్లూరు లో 18 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.28 కోట్ల షేర్ ... 6.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 46 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... ఓవర్సీస్ లో 1.28 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.02 కోట్ల షేర్ ... 10.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ ని దర్శకుడు స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: