రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ తాజాగా "ఆది పురుష్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రెండు ... మూడు రోజులు అద్భుతమైన కలెక్షన్ లు వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమాకు కలెక్షన్ లు భారీ మొత్తంలో తగ్గాయి.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం సలార్ ... ప్రాజెక్ట్ కే ... మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో సలార్ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ మరో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకుడు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సీతా రామం మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రేంజ్ విజయాన్ని అందుకొని సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హను రాఘవపూడి ... ప్రభాస్ కు ఒక కథను వినిపించగా ... ఆ కథ అద్భుతంగా నచ్చిన ప్రభాస్ వెంటనే హను రాఘవపూడి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: