మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తమిళ సినిమా లలో నటించి తమిళ మూవీ ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ నటి ఈ సంవత్సరం విడుదల అయినటువంటి కళ్యాణం కమనీయం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. 

మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది. అలాగే ఈ మూవీ కి పరవాలేదు అనే రేంజ్ లో టాక్ కూడా లభించింది. కాకపోతే అదే సమయంలో భారీ క్రేజ్ ఉన్న అనేక సినిమాలు థియేటర్ లలో విడుదల కావడంతో ఈ మూవీ కి సరైన క్రేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు కూడా దక్కలేదు. కాకపోతే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన అందంతో ... నటనతో ప్రేక్షకులను బాగానే అలరించింది. దానితో ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి తన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రియ భవాని శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్.లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ నటి వెరీ డీసెంట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ... డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న బ్లౌజ్  ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: