అది కూడా కొత్త దర్శకులతో చేస్తూ ఇండస్ట్రీకి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లను పరిచయం చేస్తున్నాడు నాని. అయితే దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల ను పరిచయం చేశాడు నాని. అయితే తాజాగా ఇప్పుడు నాని 30 సినిమాపై అందరి దృష్టి పడింది. కాగా ఈ సినిమా కూడా డబ్ల్యూ డైరెక్టర్ తోనే చేస్తున్నాడట నాని. శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నాని 30 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో నానికి జోడిగా సీతారామం హీరోయిన్ మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సూపర్
ఫాస్ట్ గా జరుగుతుండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ చాలా డిఫరెంట్ గా విడుదల చేశాడు నాచురల్ స్టార్ నాని. అయితే చాలా రోజుల తర్వాత తన సోషల్ మీడియా ద్వారా నాని 30 అప్డేట్ ను అందించాడు. ఇక ఆయన స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ రెడీనా అని ఒక ఫోటోని విడుదల చేశాడు. బ్యాగ్రౌండ్ లో సిల్వర్ స్క్రీన్పై వైరా ఎంటర్టైన్మెంట్స్ డిస్ప్లే అవుతున్న స్టిల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు నాచురల్ స్టార్ నాని. దీంతో నాని కొత్త సినిమాకి సంబంధించిన ఈ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి