ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఈ సినిమాకు రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టారు అంటే నమ్మడం అసాధ్యం అనే చెప్పాలి. దీనిని చూసిన తర్వాత అమీర్పేట్ గ్రాఫిక్స్ కంటే దారుణంగా ఉంది అని.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ కంటే హీనంగా ఉందని.. నాగ అశ్విన్ ను ఏదో ఊహించుకున్నాము కానీ ఇదేమి లుక్కు రా బాబు అంటూ రకరకాలుగా భారీ స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. హడావిడిగా ప్రాజెక్టుకే ఫస్ట్ లుక్ వదిలిన టీము ఇప్పుడు భారీగా ట్రోల్ ఎదుర్కొంటుందని చెప్పాలి. ఫస్ట్ లుక్ ఏమాత్రం ఆకట్టుకోలేదని సినిమా ప్రేమికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చివరికి అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఐరన్ మ్యాన్ సూట్ ధరించిన ప్రభాస్.. ఇందులో పొడవైన జుట్టుతో కనిపించారు. అది యాంగిల్ మిస్టేకా లేక మార్ఫింగ్ చేసి నిజంగానే వదిలారో తెలియదు కానీ బాడీకి.. ప్రభాస్ తలకు ఏమాత్రం సింక్ కాలేదు. అసలు ఫ్రాంక్ పోస్టర్ లా ఉంది అని .. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా ముఖ్యం అదే పోయింది అంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి