ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్రేజ్ ఉన్న సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వార్ కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే సంక్రాంతి కి తమ సినిమాలను విడుదల చేయబోతున్నట్లు నాలుగు తెలుగు మూవీల ప్రొడక్షన్ హౌస్ లో ప్రకటించాయి. ఆ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ లో మేహేద్ సరసన శ్రీ లీల ... మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అనుపమ పరమేశ్వరి ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న హనుమాన్ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: