విజయ్ దేవరకొండ తమ్ముడు గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తన నటనతో ప్రేక్షకులగాలను ఎంతగానో అలరిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు దొరసాని అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ ... పుష్పక విమానం ... బేబీ సినిమాల్లో హీరోగా నటించాడు. ఇందులో ఈ నటుడు నటించిన ఎక్కువ శాతం మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ నటుడు నటించిన సినిమాలలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఆనంద్ హీరోగా నటించిన సినిమాలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన దొరసాని మూవీ కి మొదటి రోజు 2.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

కొంత కాలం క్రితం ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మొదటి రోజు 3.2 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఆనంద్ దేవరకొండ తాజాగా బేబీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి మొదటి రోజు 6.6 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: