సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 10 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. దీనితో ఈ సినిమాకు ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.
మొదటి రోజు ఈ సినిమాకు తమిళ నాడు ఏరియాలో 22.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
మొదటి రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.50 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
మొదటి రోజు ఈ సినిమాకు కర్ణాటక ఏరియాలో 11.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
మొదటి రోజు ఈ సినిమాకు కేరళ ఏరియాలో 5.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
మొదటి రోజు ఈ సినిమాకు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
మొదటి రోజు ఈ సినిమాకు ఓవర్ సిస్ లో 35.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
మొదటి రోజు ఈ సినిమాకు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 44.75 కోట్ల షేర్ ... 91.20 కోట్ల గ్రాస్ కలెక్ష న్ లు దక్కాయి.
ఇకపోతే ఈ సినిమా 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా మరో 79.45 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించవలసి ఉంది.