సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్న కూడా హీరోయిన్ నయనతార అంటే ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా నయనతార సినిమాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక అలాంటి సినిమాలను ఎంచుకుంటుంది ఆమె. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది నయనతార. ఇక కొత్తకొత్త సినిమాలు చేయడంలో నయనతారను ఢీకొట్టే హీరోయిన్ ఇప్పటివరకు లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కొన్ని కొన్ని సార్లు ఆమె కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అన్న విషయం ఎవరికీ తెలియకపోవచ్చు. తన బాడీకి మ్యాచ్ కాని కథలను కూడా ఎంచుకుంటూ కొన్ని డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ అందాల తార .

అయితే కొన్నిసార్లు మంచి సినిమాలను ఎక్కువ రెమ్యూనరేషన్ కోసం ఆశపడి అత్యాశతో ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటుంది నాయనతార. ఇక ఆ సినిమాల లిస్టులోకి మరొక కొత్త సినిమా కూడా చేరింది అని అంటున్నారు. అదే వకీల్ సాబ్ సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో అంజలి పాత్ర కోసం ముందుగా నయనతారను సంప్రదించారట మేకర్స్. ఇక పవన్ కళ్యాణ్ పాత్రతో సమానంగా ఆమె డిజైన్ చేయమని మేకర్స్ కు ఒక స్ట్రాంగ్ కండిషన్ పెట్టిందట నయనతార. దీంతో ఇదంతా జరిగే పని కాదు అంటూ నయనతారను ఈ సినిమా నుండి తొలగించారట. అనంతరం ఈ పాత్ర కోసం అందరిని సంప్రదించారట. మేకర్స్ అంజలికి కథ వినిపించిన

 తర్వాత అంజలికి కథ నచ్చటంతో ఈ సినిమా చేయడానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా ఈ సినిమాలో నయనతార ప్లేస్లో అంజలి రావడం జరిగింది. అనంతరం అంజలి మరియు పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే .అంతే కాదు నయనతార కంటే అంజలి నీ ఈ పాత్రకు 100 శాతం న్యాయం చేసింది అని ఈ వార్త తెలిసిన తర్వాత చాలామంది కామెంట్స్ చేస్తున్నారు .ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయని అందుకోవడంతో నయనతార హెడ్ వైట్ కూడా తగ్గింది అని ఈ సందర్భంగా చాలా మంది పేర్కొంటున్నారు. ఇక అలా అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన నయనతార ఇప్పుడు పవన్ సినిమాలో ఒక్కసారి ఛాన్స్ వచ్చినా చాలు అని ఎప్పటినుండో ఎదురు చూస్తుందట. ఇలా నయనతార కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: