
గతంలో కూడా డైరెక్టర్ నెల్సన్ బీస్ట్ సినిమాని తెరకెక్కించగా ఫ్లాప్ గా నిలిచింది.. జైలర్ సినిమాలో రజనీకాంత్ నటన ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేసింది.. మొదటి రోజా ఏ సినిమా 90 కోట్ల రూపాయలకు పైన కలెక్షన్లు కాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మొదటి రోజు 10 కోట్లు రాబట్టింది.. ప్రస్తుతం ఈ సినిమా రూ .400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ రజినీకాంత్ కు జోడిగా నటించారు.
ఇందులో కీలకమైన పాత్రలు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సునీల్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో తమన్నా నువ్వు కావాలయ్యా అనే పాటకు డాన్స్ వేయడం జరిగింది.. ఈ పాట ఎంత సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ పాట చాలా వైరల్ గా మారుతోంది.. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు ఈ పాటకు సంబంధించి పలు రకాల రీల్స్ సెలబ్రిటీలు కూడా రీల్స్ చేస్తూ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో జపాన్ కు చెందిన యువతులు ఈ పాటకు హుక్ స్టెప్పును వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారుతోంది.