ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే ఆ సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉండడంతో ఈ రీ రిలీజ్ ల జోరు మరింతగా పెరిగి పోయింది. దానితో ఇంతకు ముందు ఒక రోజు ఒక సినిమా రీ రిలీజ్ అవుతూ వచ్చిన సందర్భాలు ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఈ రీ రిలీజ్ లు కూడా మామూలు సినిమాల్లాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడడానికి రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా ఈ ఒక్క రోజే రెండు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ కాబోతున్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ చాలా సంవత్సరాల క్రితం వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన యోగి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించగా ... రమణ గోగుల ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ రోజు అనగా ఆగస్టు 18 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

ఇకపోతే తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ కొంత కాలం క్రితం రఘువరన్ బీటెక్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. అమలా పాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను కూడా ఈ రోజు అనగా ఆగస్టు 18 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఇలా ఈ రెండు మూవీ లు కూడా ఈ రోజు థియేటర్ లలో రీ రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ రెండు సినిమాలలో ఏ మూవీ కి ప్రేక్షకుల నుండి ఎక్కువ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: