ఇప్పటి వరకు ఎన్నో ఇతర భాష సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు ఇతర భాష సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి ... విడుదల అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : కన్నడ డబ్బింగ్ సినిమా అయినటువంటి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.25 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

రోబో 2.0 : రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

రోబో : రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది.

జైలర్ : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సినిమా కేవలం 7 రోజుల్లోనే 31.23 కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 10 వ తేదీన విడుదల అయ్యి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

కాంతారా : రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.65 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: