మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలు అయితే హిట్టు కొట్టడానికి చాలా కష్టపడి పోతున్నారు. ఇక బాలయ్యకు స్పెషల్ ఆడియన్స్ ఉండడంతో మాస్ యాక్షన్ సినిమాలు తీయడంతో సూపర్ హిట్ లు సాధిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడూ సీనియర్ హీరోలు కూడా రూటు మార్చారు అన్నది తెలుస్తుంది. ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టుగానే వినూత్నమైన కథలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బోళా శంకర్ తో డిజాస్టర్ చవిచూసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవల తన 150 సినిమాను ప్రకటించారు.
బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతుంది. ఇక ఒక సోషియో ఫాంటసీ మూవీ గానే ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇక 157 వ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన పోస్టర్ లోనే దీనికి సంబంధించి చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఇక పోస్టర్ ఇంత థ్రిల్లింగ్ గా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో బింబిసారా లాంటి హిట్ తర్వాత వశిష్టకు రెండో మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతున్నాయి. హీరో వెంకటేష్ సైతం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరఫ్ అడ్రస్ అయినా శైలేష్ కొలనుతో సైంధవ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక నాగార్జున సైతం ఇలాంటి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి