మెహర్ రమేష్ ఇంకా అప్డేట్ అవ్వలేదని.. అవుట్ డేటెడ్ సినిమా తీశాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. పదేళ్ల క్రితం రావాల్సిన సినిమాని ఇప్పుడు 2023లో ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయింది. అయితే బోళాశంకర్ ఫ్లాప్ తర్వాత చిరంజీవి తర్వాత ప్రాజెక్టు ఏంటి అన్న విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో.. ఒక సినిమాను ప్రకటించాడు మెగాస్టార్. ఈ సినిమా బ్రో డాడీ రీమేక్ అని తెలుస్తుంది.
బింబిసారా సినిమాతో సూపర్ హిట్ సాధించిన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగా 157 వ సినిమాను ప్రకటించారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సోషియో ఫాంటసీ మూవీ గానే ఉండబోతుంది. అయితే ఇక తన 158వ సినిమాని ఇప్పటివరకు ఓటమి ఎరుగని దర్శకుడు తో చేసేందుకు సిద్ధమవుతున్నారట మెగాస్టార్. అనిల్ రావిపూడి ఇప్పటికే ఒక కథను వినిపించగా.. మెగాస్టార్కు నచ్చిందట. ఇక చర్చలు కూడా పూర్తయ్యాయట. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన రాబోతుందట. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కి ఈ సినిమా ఉండబోతుందట. ఇక చిన్న మెసేజ్ కూడా ఇస్తారట. కాగా అనిల్ రావిపూడి డైరెక్టర్కు మెగాస్టార్ కామెడీ టైమింగ్ తోడైతే ఇక రచ్చ రచ్చ అనుకుంటున్నారు ఫ్యాన్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి