పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి ఈ సంవత్సరం కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయం అందుకున్న సినిమాలలో హాస్టల్ హుడుగారు బేకగిద్దరే మూవీ ఒకటి. ఈ సినిమా ఈ సంవత్సరం జూలై 21 వ తేదీన విడుదల అయ్యి కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ సినిమాను తెలుగు లో బాయ్స్ హాస్టల్ పేరుతో విడుదల చేశారు. ఇకపోతే అప్పటికే కన్నడ లో ఈ సినిమా మంచి విజయం సాధించి ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ తెలుగులో విడుదల ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు ప్రేక్షకులను పరవాలేదు అనే రీతిలో అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. 

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి జీ 5 సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు సెప్టెంబర్ 15 వ తేదీ నుండి జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయినవారు ఉంటే ఈ మూవీ జీ 5 లో సెప్టెంబర్ 15 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: