
ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ చేతులో భారతీయుడు-2 సినిమా ఉన్నది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. టాలీవుడ్ ప్రేక్షకులను బాగా మిస్ అవుతున్నానని గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఈమె నటించిన గత చిత్రాలు చెక్, కొండ పొలం వంటి సినిమాలు భారీ డిజాస్టర్ లను మూటకట్టుకున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు ఈమెకు అవకాశాలు ఇవ్వలేదు. మరొకవైపు నిర్మాత జాకీభగ్నానిని ప్రేమించి నిరంతరం పెళ్లి వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.
ఏడాది రకుల్ జాకి ఇద్దరు కూడా వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీతిసింగ్ సినిమాలలో కంటే ఎక్కువగా తన బాడీ ఫిట్నెస్ మైంటైన్ చేయడం కోసమే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా జిమ్ సెంటర్ ని కూడా అందుకోసం సపరేట్గా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది రకుల్ ప్రీతిసింగ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఇప్పుడైనా సౌత్ లో అవకాశాలు వస్తాయేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి