తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలు అయినటువంటి అల్లు అర్జున్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ , వెంకటేష్ ప్రస్తుతం కొన్ని సినిమాలలో హీరోలుగా నటిస్తున్నారు. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? అందుకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు అల్లు అర్జున్ మరియు ఇతరులపై కీలక సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు కోటి పరిసర ప్రాంతాల్లో మహేష్ బాబు పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం గండిపేట్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు.

వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా షూటింగ్ ను శ్రీలంక లో తిరకెక్కిస్తున్నారు.

ఇకపో తే ప్రస్తుతం వీరు నటిస్తున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: