నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే అఖండ , వీర సింహా రెడ్డి లాంటి రెండు వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక రెండు వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సైన్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టాలి అనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్ప్రైజ్ వీడియోను ఈ రోజు సాయంత్రం 5 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  

పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే వరుస విజయాల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: